
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఉమ్మడి మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా పొచ్చర్లలో 12సెంటిమీటర్ల వర్షం పడింది. అలాగే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో 7 సెంటిమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా సొనాలలో 6 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపన్నపేటలో 6 సెంటీమీటర్లు వర్షం కురిసింది. హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. శేరిలింగంపల్లిలో 4.5 సెంటిమీటర్ల వర్షం పడింది. బాలానగర్ లో 3.5, కూకట్ పల్లిలో 3 సెంటిమీటర్ల వర్షం పడింది.
మరోవైపు నైరుతీ రుతుపవనాలు రేపు రాష్ట్రానికి రావొచ్చని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. వీటిప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు పడతాయంటోంది వాతావరణ శఆఖ. మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ఒకటి, రెండు చోట్ల భారీ వానలు పడతాయని చెప్పారు.