
జూన్ నెలలోకి ఎంట్రి ఇచ్చామో లేదో వాతావరణంలో మార్చు వచ్చింది. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ కూల్ గా ఉంది. పలుచోట్ల చిరు జల్లులు సిటీ వాసులను పులకరించాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వర్షాలు పలుకరించాయి. తెల్లవారుజామున జగిత్యాల జిల్లాలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు పోలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు కరీంనగర్ లోనూ ఉదయం వర్షం పడింది. దీంతో వెదర్ కూల్ గా మారింది.
అటు తెల్లవారుజామున హైదరాబాద్ లో చిరు జల్లులు కురిశాయి. పలు ఏరియాల్లో వర్షం పడింది. దీంతో నిన్న మొన్నటి వరకు రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి.