
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిశాయి. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి జల్లులు కురిశాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గఢ్, చిల్పూర్ మండలాల్లో వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో కూడా వర్షం కురిసింది. హైదరాబాద్, మెదక్, పెద్దపల్లి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కుమ్రం భీం జిల్లా చింతలమనేపల్లిలో భారీ వర్షానికి దిందా వాగు పొంగింది. దీంతో దిందా, కేతి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.