
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. వానల కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు కొంత ఊరట లభించింది. గురువారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. హైదరాబాద్ లో అయితే ఎక్కువ వర్షం పడుతుందని తెలిపింది వాతావరణ శాఖ. మల్కాజిగిరి, నాంపల్లి, అల్వాల్, అంబర్‌పేట, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, ఖైరతాబాద్, సోమాజిగూడ, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లిలో రహదారులపై వరదనీరు నిలిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ హైటెక్‌సిటీ, పంజాగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం సమస్య తలెత్తింది. రహదారులపై వరదనీరు నిలిచిపోకుండా జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించాయి.
మరో రెండ్రోజులపాటు…
మరో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఉత్తరభాగం మరియు దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ అత్యవసర సహాయక బృందాలను అప్రమత్తం చేశారు.