HyderabadRains: హైదరాబాద్ సిటీలోని ఈ ఏరియాల్లో వచ్చే రెండు గంటల్లో వాన

HyderabadRains: హైదరాబాద్ సిటీలోని ఈ ఏరియాల్లో వచ్చే రెండు గంటల్లో వాన

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం నుంచి వాన ముసురు కమ్ముకుంది. సిటీలోని చాలా ప్రాంతాలు గురువారం ఎండను చూడలేదు. కారు మేఘాలు కమ్మేయడంతో వాన కుమ్మేయడం ఖాయమని తేలిపోయింది. వచ్చే రెండు గంటల్లో హయత్ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, కాప్రా, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, బడంగ్ పేట్, చార్మినార్, నాంపల్లి, మలక్ పేట్, ఖైరతాబాద్, కిషన్ బాగ్, బహదూర్ పుర, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. వనస్థలిపురం ప్రాంతంలో ఇప్పటికే చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్‌‌లో​స్థానికంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితులు, వ్యవస్థల వల్లే అధిక వర్షాలు పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మామూలుగా అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలతో వర్షాలు పడుతుంటాయి. కానీ, ఈసారి మూడు నాలుగు సార్ల కన్నా ఎక్కువగా అల్పపీడనాలు గానీ, వాయుగుండాలు గానీ ఏర్పడలేదు. సిటీలో పొద్దునంతా తీవ్రమైన ఎండ కొట్టడం, సాయంత్రం కాగానే నల్లటి మబ్బులు కమ్మేసి వర్షాలు పడడమే ఎక్కువ సార్లు జరిగింది. అంటే అప్పటిదాకా ఏర్పడిన వేడిగాలి, సాయంత్రం వచ్చే చల్లటి గాలులు కలిసి క్యుములోనింబస్​మేఘాలు కమ్మేసి వర్షాలు పడ్డాయే తప్ప.. మాన్సూన్​ప్రభావంతో కురిసిన వర్షాలు తక్కువేనని ఎక్స్‌‌‌‌పర్ట్స్​చెబుతున్నారు.

►ALSO READ | కార్తీకంలో నదీస్నానం.. ఆధ్యాత్మికమే కాదు... ఆరోగ్యం కూడా

ఇదంతా కూడా వాతావరణంలో ఏర్పడుతున్న అనూహ్య మార్పులు, పరిణామాల వల్లేనని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మైక్రో క్లైమేట్‌‌లో మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు. సెప్టెంబర్ 14, 17వ తేదీల్లో కురిసిన కుంభవృష్టి వర్షానికి రోడ్లన్నీ చెరువులయ్యాయి. ముఖ్యంగా సెప్టెంబర్​17న కేవలం మూడు గంటల్లోనే దాదాపు 19 సెంటీమీటర్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే.