
విజయవాడలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో నగరంలో చెట్లు, హోర్డింగులు విరిగిపడ్డాయి. పలుచోట్ల ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. జగన్ ప్రమాణ స్వీకారం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్టేజీ పైకప్పు గాలీవానకు పాక్షికంగా దెబ్బతింది. స్టేజీపై పరదాలు పూర్తిగా ఎగిరిపోయి…ప్రాంగణమంతా బురదమయంగా మారింది. అర్ధరాత్రి 2 తర్వాత వర్షం తెరిపివ్వడంతో…వైసీపీ నేతలు, అధికారులు గ్రౌండ్ కు చేరుకుని యుద్దప్రాతిపదికన పునరుద్దరణ చర్యలు చేపట్టారు.