అహ్మదాబాద్లో భారీ వర్షం.. ఫ్యాన్స్లో టెన్షన్.. మ్యాచ్ను డిస్టర్బ్ చేస్తుందా..?

అహ్మదాబాద్లో భారీ వర్షం.. ఫ్యాన్స్లో టెన్షన్.. మ్యాచ్ను డిస్టర్బ్ చేస్తుందా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్-2025 ఫైనల్ దంగల్ కు రెండు  జట్లు సిద్ధమయ్యాయి. ఫ్యాన్స్ చీమల బారులు తీరినట్లుగా అహ్మదాబాద్ స్టేడియం వైపు వెళ్తున్నారు. స్టేడియం చుట్టూ ఫ్యాన్స్ కోలాహలం మొదలైంది. అంతా బాగానే ఉంది.. కానీ ఫైనల్ వేళ ఫ్యాన్స్.. టీమ్స్ లలో ఉన్న ఒకే ఒక్క డౌట్ వర్షం గురించి. ఫైనల్ రోజు (జూన్ 3) సాయత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. 

అనుకున్నట్లుగానే అహ్మదాబాద్ లో వర్షం కురుస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియం ఉన్న పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. గంట గంటకు వర్షం అన్నట్లుగా మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి వర్షం కురుస్తుండటం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. 

మంగళవారం (జూన్ 3) సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు అహ్మదాబాద్ లో వర్షం పడింది. ఆ తర్వాత కాసేపటికి వాన తగ్గటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పట్లాగే మళ్లీ స్టేడియంలో ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. అంతలోనే మళ్లీ 5 గంటలకు మరో సారి వాన ప్రారంభం అవ్వటంతో గొడుగుల కింద తలదాచుకున్నారు. 

వర్షం గ్యాప్ ఇచ్చి వస్తుండటంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. అయితే ప్రస్తుతం మళ్లీ వర్షం ఆగిపోయింది. వాతావరణ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు వర్షం వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత వెదర్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందని రిపోర్ట్ లో తెలిపింది. దీంతో మ్యాచ్ కు అంతరాయం కలగదులే అనే ధీమాలో ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్. 

THE MAD SUPPORT FOR RCB FOR FINAL 🤯 [CricSubhayan] pic.twitter.com/kEL62o7pWD

— Johns. (@CricCrazyJohns) June 3, 2025

ఇక ఫైనల్ మ్యాచ్ కోసం టాస్ వేసే సమయం రాత్రి 7 గంటలు. ఈ సమయానికి వర్షం పడే ఛాన్స్ 5 శాతం మాత్రమే ఉంది. ఆ తర్వాత నాలుగు గంటల వరకు.. అంటే రాత్రి 11 గంటల మధ్య వరకు 2 శాతం మాత్రమే వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది.

సో.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం అయితే లేదు. జస్ట్ 5 శాతం మాత్రమే అవకాశం ఉంది. సో.. మ్యాచ్ జరుగుతుంది.. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటుంది వెదర్ రిపోర్ట్. 

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. వర్షం రాకడ చెప్పటం కష్టమనే సామెత కూడా ఉంది. ఏ నిమిషానికి వాతావరణం ఎలా మారుతుందో కూడా ఊహించలేం. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఉన్న వెదర్ రిపోర్ట్ మాత్రమే ఇది.. రాత్రికి ఏమైనా జరగొచ్చు. వర్షా రాకూడదనే కోరుకుందాం.

Weather Update : Rain has Started at Ahmedabad Stadium 😯#RCBvsPBKS #IPLFinals #iplfinal2025 #IPL2025 #IPLFinal #IPLPlayoffs pic.twitter.com/DLJLN5tCZR

— Mufaddal bhAi (@muffadalbhAi) June 3, 2025