భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం అంతరాయం

భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం అంతరాయం

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చివరి టీ20కు వర్షం అంతరాయం కలిగించింది. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వాన పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. క్రీజులో  30 పరుగులతో పాండ్యా, 9 పరుగులతో దీపక్ హుడా ఉన్నారు. భారత్ విజయానికి 66 బంతుల్లో 86 పరుగులు చేయాలి. ఒక వేళ వర్షం అలాగే కొనసాగితే మ్యాచ్ రద్దు చేసే అవకాశం ఉంది. దీంతో టీ20 సిరీస్ టీమిండియా వశమవుతుంది. ఇప్పటికే తొలి టీ20 రద్దవగా..రెండో మ్యాచులో భారత్ 65 పరుగుల తేడాతో గెలిచింది. 

హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు..
అంతకుముందు టాస్ గెలిచి  బ్యాటింగ్ చేసిన కివీస్..19.4  ఓవర్లలో 160  పరుగులకే ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆ జట్టు  9 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఫిన్ అలెన్ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మార్క్ చాప్ మాన్ 12 రన్స్ చేసి పెవీలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కాన్వె, గ్లెన్ ఫిలిప్స్ జట్టును ఆదుకున్నారు. హఫ్ సెంచరీతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. మూడో వికెట్ కు 86 పరుగులు జోడించారు.

టపటపా..
130 పరుగుల వద్ద ఫిలిప్స్ ఔటవడంతో...న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పేకమేడలో కూలిపోయింది. ఆ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. మరో 16 పరుగుల వ్యవధిలో కాన్వె పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత నీషమ్, సాంట్నర్, మిచెల్ సోదీ, మిల్నే, సౌథీ స్వల్ప పరుగుల వద్ద ఔటవడంతో...చివరకు న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో సిరాజ్ , అర్షదీప్ సింగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు.