ప్రశాంతత@ రెయిన్

ప్రశాంతత@ రెయిన్

చుట్టూ  ఆకాశాన్నంటే ఎత్తైన కొండలు.. వాటి కింద కనుచూపు మేర నీలి, ఆకుపచ్చ రంగుల్లో అద్దంలా మెరుస్తూ... ప్రశాంతంగా ఉన్న సముద్రం. అక్కడక్కడా రెండు అడుగుల మందంతో పరుచుకున్న తెల్లని మంచు ప్రదేశాలు. ఇలాంటి ప్రదేశాలు భూమ్మీద ఉన్నాయా? వాటిని చూడాలంటే అక్కడికి వెళ్లగలమా? అక్కడ మనుషులు ఉంటారా? ఇలాంటి సందేహాలు బోలెడు రావచ్చు. వాటన్నింటికీ సమాధానం ఉంది. ఐదువందల కంటే తక్కువ జనాభాతో... టూరిస్ట్​లకు కావాల్సినన్ని వసతులతో... స్వేచ్ఛగా విహరించేందుకు ఈ ప్రదేశం ఆహ్వానిస్తోంది. ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాల్లో టాప్​ ప్లేస్​లో ఉంటుంది ‘రెయిన్​’. నార్వేలోని లోఫోటెన్ ఐలాండ్​లలో రెయిన్​ ఫేమస్​. 

ఫొటోగ్రాఫర్స్​కు, టూరిస్ట్​లకు చాలా ఇష్టమైన ప్లేస్​ రెయిన్. ఫొటోలు కూడా చాలా పాపులర్​. రెయిన్​ నార్తర్న్​​ నార్వేలో మాస్కెన్స్​ మున్సిపాలిటీలో ఉంది. 2018 లెక్కల ప్రకారం అక్కడ నివసించేది 314 మంది జనాభా. చిన్న సైజు లైట్ ఇండస్ట్రీ ఉందిక్కడ. రైన్ 1743 నుంచి క్వాడ్, స్టాక్ ఫిష్​లకు ఫేమస్. ఫిషింగ్, మార్కెటింగ్ చేస్తారు. అందుకే దీన్ని ‘ఫిషింగ్ విలేజ్’ అని కూడా అంటారు.1747లో ఇది వరల్డ్ గ్రేటెస్ట్ కాడ్ హార్వెస్ట్​ ప్లేస్​గా పేరుగాంచింది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంటుంది. సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్లే వీలుంది. కానీ, సమ్మర్​లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పొద్దునంతా కార్లతో కాస్త రద్దీగా ఉంటుంది. కానీ, రాత్రుళ్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పర్వతాలపై నడక నిజంగా అక్కడికి వెళ్లి నేచర్​ని చూస్తే మాటలు రావు. ఆర్కిటిక్ మహా సముద్రం, లోఫోటెన్ కొండలు, దీవుల మధ్య ముచ్చటగొలిపే పల్లెటూరు. రెయిన్​లో కొండలపై నడవడం చాలా థ్రిల్లింగ్​గా ఉంటుంది.  అలా నడుస్తూ నేచర్​ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రెయిన్​ బ్రింజెన్ అనే పెద్ద పర్వతం.1470 అడుగుల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తులో పర్వతం మీద నడుస్తూ కనుచూపు మేర కనిపించే ప్రకృతి అందాలను చూస్తూ... ‘గాల్లో తేలినట్టుందే’ అని పాడుకోవాల్సిందే. కాలినడక కష్టమే, అయితే 2019లో మెట్ల దారిని కూడా ప్రారంభించారు. 

చేపలు పట్టడం నేర్పిస్తారు
మాస్కెన్స్​ మున్సిపాలిటీ చుట్టూ నీళ్లే. చాలా లోతైన చేపలు పట్టే ప్రాంతం. ప్రతి సంవత్సరం దాదాపు 30  వేల కిలోల పైనే క్వాడ్ ఫిష్​లు పడతాయి. ఎవరైనా చేపలు పట్టాలనుకుంటే ఒక ప్రొఫెషనల్ ఫిషర్​మ్యాన్ వచ్చి ఫిషింగ్ టెక్నిక్స్ చెప్తాడు. ట్రెడిషనల్ జిగ్గర్ వీల్ మెథడ్​తో చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తాడు. 
అంతేకాకుండా రిలాక్స్ అవ్వడానికి ప్రశాంతమైన చోటు. వాటర్​లోకి వెళ్లాలనుకుంటే కాయక్​ (పడవ) అద్దెకు తీసుకోవచ్చు. కాయక్​తోపాటు బైక్​లు కూడా రెంట్​కి ఇస్తారు. హైకింగ్ చేయాలనుకుంటే దానికి తగ్గ గైడెన్స్​ కూడా ఇస్తారు. 

రార్బర్ సంగతులు
రెయిన్​లో 32 క్యాబిన్​లు ఉన్న  రెయిన్​ రార్బర్ (హోటల్) ఉంది. అందులో క్యాబిన్స్ అన్ని మోడర్న్​గా ఉంటాయి. అయినా కూడా వాళ్ల ట్రెడిషనల్ అట్మాస్పియర్​ కనిపిస్తూనే ఉంటుంది. అందరూ వంట​ సామాగ్రి తెచ్చుకుని ఆరోజు  పట్టిన చేపల్ని తెచ్చి వండుకుని తింటారు. అంతేకాకుండా అక్కడి బార్, రెస్టారెంట్​లలో ఫుడ్ కూడా బాగుంటుంది. క్లౌడ్ బెర్రీ క్రీమ్ వేఫర్​ కోన్స్, వెనిల్లా క్రీమ్ వంటి డెజర్ట్​లు కూడా పెడతారు. ఫ్రెష్​గా పట్టిన చేపలతో సీ ఫుడ్ దొరుకుతుంది. సీ ఫుడ్ బార్​లో చిన్న రొయ్యలు, హోమ్ మేడ్ ఫిష్​ బర్గర్ చాలా పాపులర్. వాటితోపాటు శ్నాక్స్​ కూడా దొరుకుతాయి. 

ఆర్ట్​కి ప్రిఫరెన్స్​ ఎక్కువ
ఇక్కడ ఆర్ట్, క​ల్చర్​కి మొదటి ప్రిఫరెన్స్​ ఇస్తారు. స్కూల్స్​లో ఆర్ట్ గ్యాలరీ, కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి.  వాటితోపాటు ఒక చిన్న కెఫె కూడా ఉంటుంది. నార్తర్న్​ నార్వేజియన్ ఆర్టిస్ట్ ఇవా హార్ అనే ఆర్టిస్ట్ లైట్, కలర్స్ థీమ్​తో రెయిన్​పై ఎన్నో పెయింటింగ్స్​ వేశారు. ఎప్పటికీ ఉండిపోయేలా పర్మినెంట్​ ఎగ్జిబిషన్ పెట్టాడు. ఫొటో ఎగ్జిబిషన్స్​ కాకుండా, లోకల్​గా కనిపించే పక్షులు, జంతువులతో ఏర్పాటైన నేచర్ ఎగ్జిబిషన్​ చూడొచ్చు. సమ్మర్​లో ఈవెంట్స్ కూడా జరుగుతాయి.

ఊరే ఒక మ్యూజియం
మాస్కెన్స్​ హిస్టరీ అండ్ మ్యూజియం సొసైటీ నార్వేజియన్ ఫిషింగ్ విలేజ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి మొత్తం విలేజ్​ కూడా ఒక పెద్ద ఎగ్జిబిషన్​లాంటిదే అంటారు అక్కడికి వెళ్లిన వాళ్లు. అక్కడ 19వ శతాబ్దానికి చెందిన స్టోన్ ఒవెన్ బేకరీ ఇప్పటికీ వాడుకలో ఉంది. దాని మీద బ్రెడ్, బన్స్ తయారుచేసి విలేజ్ కెఫెలో అమ్ముతారు.

అక్కడి లోకల్ న్యూస్ పేపర్ ‘లోఫోట్పోస్టెన్’. ఇది నార్త్ నార్వేలో పేరున్న పేపర్. 
ఇప్పుడు ఫిష్​ ప్రాసెసింగ్, మార్కెటింగ్​తో పాటు టూరిజం డెవలప్ అయింది. ప్రతి ఏడాది వేలల్లో టూరిస్ట్​లు వస్తుంటారు.
1941 డిసెంబర్, రెండో ప్రపంచయుద్ధం టైంలో జర్మనీ వాళ్లు రెయిన్​లో కింది భాగంలో సగం వరకు కాల్చేశారు. 
తూర్పు మాస్కెన్స్ నుంచి 9కిలో మీటర్ల దూరంలో ఎయిర్ పోర్టు ఉంది. అక్కడి నుంచి 125 కిలో మీటర్లు వెళ్తే రెయిన్​ చేరుకుంటారు. వింటర్, సమ్మర్​లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. 
1970లో, నార్వేలో అల్లెర్స్ అనే వీక్లీ మ్యాగజైన్​లో బ్యూటిఫుల్ విలేజ్​గా రెయిన్​ ఫొటోలు వేశారు. తర్వాత అవి టూరిస్ట్​ బ్రోచర్స్, బుక్స్​గా వాడుకున్నారు. 
1999లో ఇంగో కుల్హ్​ అనే పెయింటర్ రోర్బులో ఒక స్టూడియో పెట్టాడు. అందులో హార్బర్ అందాలను పెయింటింగ్ వేశాడు. 
సమ్మర్​ సీజన్​లో కెఫెలు, రెస్టారెంట్లు టూరిస్ట్​లను అట్రాక్ట్ చేయడానికి పోటీ పడుతుంటాయి. ఎందుకంటే ఆ చిన్న ఊళ్లో పార్కింగ్​కి ప్లేస్ ఉండదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే రెయిన్​ ఫొటోలు, టూరిస్ట్ బ్రోచర్స్, గైడ్స్, వెబ్ పేజ్​లు, బుక్స్​ ఉన్నాయి. 

ఎలా వెళ్లాలంటే...
చాలామంది నార్వే లోని ఊరైన లెక్నెస్​ లేదా స్లొవేర్​ల నుంచి వెళ్తారు. అవి రెండూ చిన్న ఎయిర్ పోర్ట్​లు. అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్​లు, కార్లు ఉంటాయి. వాటిని ముందే బుక్ చేసుకోవాలి. లేదంటే ఎవెనెస్​ ఎయిర్​పోర్ట్ నుంచి నాలుగ్గంటలు ప్రయాణం చేసి వెళ్లొచ్చు. బోడో టౌన్​ నుంచి కార్​ తీసుకుని కూడా వెళ్లొచ్చు. అలా అయితే రెండు మైళ్ల దూరం ప్రయాణించాలి. బోడో నుంచి నార్వేకి రైలు మార్గం కూడా ఉంది.