వర్షమే పాక్‌ను కాపాడుతోంది: ఇంగ్లాండ్ జోరుకు వరుణుడి బ్రేక్.. నెట్టింట ట్రోలింగ్!

వర్షమే పాక్‌ను కాపాడుతోంది: ఇంగ్లాండ్ జోరుకు వరుణుడి బ్రేక్.. నెట్టింట ట్రోలింగ్!

England vs Pakistan: ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు వర్షం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఫస్ట్ రోజే ఇంగ్లీష్ పేసర్ల ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ కంప్లీట్‌గా కుప్పకూలిపోయింది. ఒలీ రాబిన్సన్, జోష్ టంగ్ చెరో 5 వికెట్లతో చెలరేగడంతో పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మొదటి రోజు ముగిసే సమయానికి 112/2తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. క్రీజులో జో రూట్ (37 నాటౌట్) నిలకడగా ఆడుతుండటంతో పాక్‌కు ఘోర పరాభవం తప్పదేమో అనుకుంటున్న టైమ్‌లో, సెకండ్ డే వర్షం వచ్చి ఆటను నిలిపేసింది.

పాక్ 12త్ మ్యాన్ వర్షమే: నెట్టింట మీమ్స్ రచ్చ: 

రెండో రోజు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాకిస్థాన్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. పాక్ జట్టుకి గుడ్ న్యూస్.. హెడింగ్లీలో వర్షం పడుతోందనే క్యాప్షన్లతో పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ మాస్ డామినేషన్ నుంచి, మరో ఘోరమైన పరాభవం నుంచి పాకిస్థాన్‌ను కాపాడటానికి వర్షమే 12వ ఆటగాడిగా మైదానంలోకి వచ్చిందంటూ మీమ్స్‌తో రచ్చ రంబోలా చేస్తున్నారు. వాన పడకపోతే పాక్ గతి ఏమయ్యేదో అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ALSO READ : IPL మాత్రం ఆడొద్దు: మానవ్ సుతార్‌కు పుజారా సలహా..  

రెస్ట్ దొరికినా రేస్ ఇంగ్లాండ్‌దే.. పాక్‌కి నెక్స్ట్ లెవెల్ గండం: 

ఈ వర్షంతో పాకిస్థాన్‌కు తాత్కాలికంగా కొంత ఊరట లభించినా, మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లాండ్‌దే కంప్లీట్ అప్పర్ హ్యాండ్. వాతావరణం ఇలాగే ఉండి మ్యాచ్ మరింత ఆలస్యమైతే ఇంగ్లాండ్ మొమెంటమ్‌కి కొంచెం బ్రేకులు పడొచ్చు. కానీ, ఆట తిరిగి ప్రారంభం కాగానే ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో దారుణంగా తడబడిన పాక్, మ్యాచ్‌లో నిలబడాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది.