వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా.. క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా-గాయత్రి జోడీ!

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా.. క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా-గాయత్రి జోడీ!

Treesa Gayatri: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ యువ షట్లర్లు ట్రీసా జాలీ–- గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. ఈరోజు (ఆగస్టు 20, గురువారం) జరిగిన మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో జపాన్‌కు చెందిన 7వ సీడ్ జంట రెన్ ఇవానగా - కీ నకనిషిలను 21–16, 21–12 తేడాతో వరుస గేమ్‌లలో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న భారత జోడీ ఆరంభం నుంచే ఫుల్ అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడింది. ట్రీసా తన పవర్‌ఫుల్ జంప్ స్మాష్‌లతో ప్రత్యర్థులపై విపరీతమైన ఒత్తిడి పెంచగా, గాయత్రి ఫ్రంట్ కోర్టులో మైండ్ బ్లాకింగ్ టైమింగ్‌తో పాయింట్లు సెట్ చేసింది. వీరిద్దరి పర్ఫెక్ట్ కోర్టు రొటేషన్స్ జపాన్ జంటకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 

కోర్టులో బిగ్ డ్రామా.. ఎల్లో కార్డ్ అండ్ గోపీచంద్ మాస్టర్ ప్లాన్: 

ఈ మ్యాచ్‌ మధ్యలో హై-వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. లైన్‌ కాల్స్‌ విషయంలో భారత ప్లేయర్లకు, అంపైర్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం జరగడమే కాకుండా, షటిల్‌ను ఉద్దేశపూర్వకంగా కొట్టినందుకు ట్రీసాకు అంపైర్ ఎల్లో కార్డు కూడా ఇచ్చాడు. ఈ ఉద్రిక్త సమయం నుంచి కోచ్‌ పుల్లెల గోపీచంద్ కూల్‌గా మ్యాచ్‌ను తిప్పేశారు. అంపైర్ నిర్ణయంతో ఒత్తిడిలోకి వెళ్లకుండా ట్రీసా, గాయత్రిలను ప్రశాంతంగా ఉంచి, టాక్టికల్‌గా గేమ్‌ను హోల్డ్ చేసేలా మాస్టర్ ప్లాన్ చేశాడు. దాంతో మన ప్లేయర్స్ మరింత ఫోకస్‌గా ఆడి మ్యాచ్‌ను కంప్లీట్‌గా తమ వైపు తిప్పుకున్నారు.

చైనాతో అమీతుమీ,, హెడ్ టు హెడ్ రికార్డ్‌కు చెక్ పడేనా?: 

క్వార్టర్‌ ఫైనల్లో భారత జోడీ చైనాకు చెందిన ప్రపంచ నంబర్‌ 4 జియా యి ఫాన్– జాంగ్ షు షియాన్‌తో పోటీ పడబోతుంది. ఇప్పటి వరకు ఈ చైనా జోడీతో గాయత్రి– ట్రీసా మూడు సార్లు తలపడగా.. ఒక్కసారి కూడా గెలుపు రుచి చూడకపోవడం గమనార్హం. కానీ ప్రస్తుత ఫామ్‌ను కొనసాగించి విజయం సాధిస్తే భారత జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుంటుంది. దాంతో పాటు చైనాతో ఓటముల పరంపరకు కూడా తెర పడుతుంది. 

ALSO READ : IPL మాత్రం ఆడొద్దు: మానవ్ సుతార్‌కు పుజారా సలహా..

15 ఏళ్ల కల నెరవేరేనా? చరిత్ర సృష్టించేందుకు రెడీ!

భారత మహిళల డబుల్స్ హిస్టరీలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చివరిసారిగా జ్వాలా గుత్తా - అశ్విని పొన్నప్ప జంట 2011లో పతకం సాధించి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత సుదీర్ఘ కాలంగా ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. రేపు (శుక్రవారం) జరిగే హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్‌లో చైనా జోడీని ఓడిస్తే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారత మహిళల డబుల్స్ జోడీగా గాయత్రి గోపీచంద్ - ట్రీసా జాలీ ఇండియన్ బ్యాడ్మింటన్ చరిత్రలో మరో ఐకానిక్ పేజీని లిఖించనున్నారు.