
రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో కొన్ని చోట్ల వాతావరణం చల్లబడింది. నిజామాబాద్‌లో అత్యధికంగా 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 39.8, మెదక్‌లో 39.2, మహబూబ్‌నగర్, రామగుండంలో 38.2, భద్రాచలంలో 31 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. కాగా, సోమవారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, భద్రాద్రి, ఆసిఫాబాద్, ములుగు, వరంగల్ (రూరల్), జనగాం, నల్గొండ, పెద్దపల్లి, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో వర్షం పడింది. ఈ నెల 20 తర్వాతే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని, 21 నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.