చైనాలో జలగల వర్షం.. ఇళ్లకు పరిగెత్తిన జనం

చైనాలో జలగల వర్షం.. ఇళ్లకు పరిగెత్తిన జనం

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయాలని చాలామందికి ఉంటుంది. చిరు జల్లులు కురుస్తుంటే వీధిలోకి పరిగెత్తి డాన్స్ లు చేస్తుంటారు. చిన్నా పెద్దా చేరి ఆటలాడుతుంటారు. చైనాలోని లియోనింగ్ లో అలానే అనుకున్నారంతా. మబ్బులు పట్టి చినుకులు పడటం ఆలస్యం.. రోడ్డుపైకి పరిగెత్తుకొచ్చారు. కానీ, అంతలోనే ఊహించంది జరిగింది. ఎంత స్పీడ్ గా రోడ్డుపైకి వచ్చారో.. అంతే స్పీడ్ గా ఇళ్లలోకి పరిగెత్తారు. దానికి కారణం జెలగల (పురుగుల) వర్షం. 

మామూలుగా చేపల వర్షం, వాన పాములు, కప్పల వర్షం చూస్తుంటాం... కానీ, చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్ లో జెలగల వర్షం పడింది. రోడ్డు పక్కన, పార్క్ చేసిన కార్లపై ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా జెలగలే కనిపించాడు. జెలగలు మీద పడటం చూసి.. లియోనింగ్ ప్రావిన్స్ ప్రజలంతా ఇళ్లలోకి పరిగెత్తారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం మాత్రం ఎప్పటిలాగే.. చెరువులు, సముద్రాల్లో ఏర్పడ్డ సుడిగుండాల (టోర్నాడో) వల్ల ఈ జెలగలు పైకి వెళ్లాయని, అవే ఇప్పుడు వర్షం రూపంలో చైనాలో పడ్డాయని తెలిపారు.