ఆసీస్​కు చావోరేవో.. ఇవాళ ఆస్ట్రేలియాతో ఇండియా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 ఆసీస్​కు చావోరేవో.. ఇవాళ ఆస్ట్రేలియాతో ఇండియా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సెయింట్ లూసియా):  టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అజేయంగా దూసుకెళ్తూ  సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియా పని పట్టడానికి సిద్ధమైంది.  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8 రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో భాగంగా  సోమవారం జరిగే  మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టనుంది. అఫ్గానిస్తాన్ చేతిలో కంగుతిని డీలా పడ్డ  కంగారూలకు ఈ మ్యాచ్ చావోరేవో కానుంది.  ఇందులో ఓడి, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటిదారి పట్టనుంది. టోర్నీలో ముందుకొస్తే  కంగారూ టీమ్‌‌‌‌తో సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పదు కాబట్టి సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌8 లోనే దాన్ని ఇంటికి పంపించాలని ఇండియా చూస్తోంది. పైగా, డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో తమకు గుండెకోత మిగిల్చిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రతీకారం తీర్చుకునే ఈ అవకాశాన్ని  అస్సలు చేజార్చుకోవద్దని రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన భావిస్తోంది. 

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న ఇండియా ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది.   మరోవైపు ఆస్ట్రేలియాపై తీవ్ర ఒత్తిడి ఉంది. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్ తర్వాత ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్నో బలహీనతలు బయటపడ్డాయి. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  చెత్తగా ఆడింది. గత  ఆరు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 88 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేసిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్ మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్  బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాడిలో పడినప్పటికీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా పరుగులు ఇస్తున్నాడు. ఆ టీమ్ లెగ్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడమ్ జంపా, ఇండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మధ్య పోటీ ఆసక్తి కలిగిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది.