IND vs AUS: మూడో వన్డేలో వర్షం కురుస్తుందా

IND vs AUS: మూడో వన్డేలో వర్షం కురుస్తుందా

భారత్ -ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రసవత్తరంగా మారింది. ఈ సిరీస్లో ఇప్పటికే చెరో వన్డే గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా మారింది. ఈ క్రమంలో  మూడో వన్డే కీలకంగా మారింది.  చివరి వన్డే గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్, ఆస్ట్రేలియా జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో వన్డేకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక కానుంది. మరి మూడో వన్డేకు వర్షం ముప్పు  ఉందా..?  

 
మూడో వన్డేకు వాన గండం..?

చెన్నై వన్డేకు వాన ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ ప్రారంభ సమయంలో వాన పడే అవకాశాలున్నాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ మొదలైనప్పుడు వాన పడే అవకాశాలు 47 శాతం నుంచి 51 శాతం వరకు ఉన్నట్లు పేర్కొంది. అయితే మ్యాచ్  సమయం తగ్గుతున్న  కొద్దీ వాన గండం తగ్గుతుందని తెలిపింది. అందువల్ల వర్షం వచ్చినా...ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశాలున్నాయి.  మ్యాచ్ జరిగే రోజున వాతావరణంలో తేమ 70 శాతం  నుండి 85 శాతం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.  ఆట ప్రారంభంలో ఉష్ణోగ్రత 32 అడిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని పేర్కొంది. మ్యాచ్ సమయం ముగిసే కొద్దీ..ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుందని అంచనా వేసింది. 

టాస్ దే కీ రోల్..

చివరి వన్డేలో టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఈ మ్యాచ్ కు వాన గండం పొంచి ఉన్న కారణంగా మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో  టాస్ గెలిచిన జట్టు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

వన్డే సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (సి), యుజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్.

వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (సి) సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా