CSK ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి రైనా, హెడెన్

CSK ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి రైనా, హెడెన్

చెన్నై:  సీఎస్కే తమ మాజీ ప్లేయర్లు  సురేష్ రైనా, మాథ్యూ హేడెన్‌‌ను తొలిసారి ఏర్పాటు చేసిన హాల్‌‌ ఆఫ్ ఫేమ్‌‌లో చేర్చి గౌరవించింది. ఆదివారం చెపాక్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో నిర్వహించిన ‘రోర్-26’ వేడుకలో ఇద్దరికీ అవార్డులు అందజేసింది. సీఎస్కే తరఫున అత్యధికంగా 5529 రన్స్ చేసిన రైనా నాలుగు ఐపీఎల్ టైటిళ్లు, రెండు చాంపియన్స్ లీగ్ టీ20 విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 

ఇక,  తొలి మూడు సీజన్లు సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లెజెండ్ హేడెన్ 2010లో ఫస్ట్  ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. తమ ఫ్రాంచైజీ గెలిచిన టైటిళ్లలో భాగమైన మాజీ ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చి సీఎస్కే గౌరవించింది. మురళీధరన్, రాయుడు, మైకేల్ హస్సీ, బాలాజీ,  విజయ్ , హర్భజన్ తదితరులు ధోనీ, ప్రస్తుత ప్లేయర్లతో కలిసి చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్‌‌, బౌలింగ్ చేసి ఫ్యాన్స్‌‌ను అలరించారు.