ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లా కేంద్రంలోనూ ఉదయం భారీ వర్షం కురిసింది. రోడ్ల పైకి మొకాల్లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

