Weather Alert: ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Weather Alert: ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

దేశంలో రానున్న రెండు ( మార్చి 1,2)  పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని  ఐఎండీ(IMD)  అంచనా వేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కుండపోత వానలు పడే సూచనలున్నాయంటూ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు పడుతాయని,   ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

మార్చి 1న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కూడా వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మార్చి 2న ఢిల్లీ, చండీగఢ్, జమ్మూకాశ్మీర్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది.అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 7 రాష్ట్రాలకు సంబంధించిన జాబితాను వాతావరణ శాఖ విడుదల చేసింది. శుక్రవారం, శనివారం ( మార్చి 1,2)  రెండ్రోజుల పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ(IMD) తెలిపింది.