తెలంగాణలో పలుచోట్ల వాతావరణం చల్లబడింది. నిన్నమొన్నటి వరకు ఎండలతో ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం వర్షం పడటంతో కాస్త చల్లబడింది. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది. శుక్రవారం సాయిత్రం నగర శివారుల్లో పలు చోట్ల చిరుజల్లులు పడ్డాయి. చల్లటి గాలులు వీచి.. వాతావరణం చల్లగా మారిపోయింది. అయితే తెలంగాణలో పలుచోట్ల ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉందన్నారు.
ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు మేఘావృత మైన వాతావరణం ఉంటూ చల్లటి గాలులు వీచే అవకాశాలు ఎక్కువ అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి మళ్ళీ పొడి వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.
