ఇయ్యాల, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

 ఇయ్యాల, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఆదిలాబాద్‌‌‌‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌‌‌‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లాలోని వెల్తూరులో 10.5 సెంటీమీట్లర్లు, ఐనవోలులో 8.3, నిజామాబాద్‌‌‌‌లోని మోర్తాడ్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని జడ్చర్లలో 8, ఖమ్మంలోని బాచోడులో 7.7, నిజామాబాద్‌‌‌‌లోని జక్రాన్‌‌‌‌పల్లిలో 7, భద్రాద్రి కొత్తగూడెం కర్కగూడెంలో 6.8, సిద్దిపేటలోని హబ్షీపూర్‌‌‌‌లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.