హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మబ్బులు కమ్మేశాయి, పలు చోట్ల వర్షం కురిసింది.
అత్యధికంగా మల్కాజ్ గిరిలోని ప్రశాంత్‌నగర్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా ఉంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అత్యధికంగా 43.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.

