రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోందని, రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు నుంచి 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
మరిన్ని వార్తల కోసం..
