
గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణ మారింది. సోమవారం ఉదయం, మధ్యాహ్నం చాలా హాట్ హాట్ ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడు మబ్బులు చేసుకొని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీతోపాటు శివారు ప్రాంతాల్లో పలుచోట్ల వానపడంది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, ఎస్ ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట్ ప్రాంతాల్లో పలు చోట్లు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సుచిత్ర, చింతల్, షాపూర్ నగర్ లో వానపడింది.
కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, మూసాపేట్, అల్విన్ కాలనీ, జేఎన్టీయూ, అడ్డగుట్ట, నిజాంపేట పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. దీంతో ఆ ప్రాంతాల్లో పలు చోట్లు వర్షపు నీరు రోడ్లపై నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆఫీసులనుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.