Please:  వానాకాలం వీటికి స్థలం ఇవ్వండి

Please:  వానాకాలం వీటికి స్థలం ఇవ్వండి

వర్షం వస్తుందంటే జనాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే తప్ప బయటికి వెళతారు.  అలా వెళ్లాల్సి వచ్చినా  రెయిన్​కోట్​... గొడుగు... ఇలా వాడుతుంటారు. ఇది మనుషుల పరిస్థితి .. అదే మూగజీవాలైతే వాటి పరిస్థితి ఏమిటో ఆలోచించారా...  వీధుల్లో తిరిగే కుక్కలు, పిల్లుల పరిస్థితేంటి? వాటికేం తెలీదు. వాన పడుతుంటే కొంత వరకు తట్టుకోగలవు. కానీ, రోజుల తరబడి ఆగకుండా వానపడి, మోకాళ్ల లోతు నీళ్ల చ్చేస్తే మాత్రం అవి చాలా ఇబ్బంది పడతాయి.

వర్షంలో వీధి కుక్కలు, పిల్లులకు ఉండటానికి  చోటుండదు. తినడానికి  తిండి దొరకదు. ఎక్కడికి వెళ్లలేక చలికి వణుకుతూ, కొన్ని ప్రాణాలు పోగొట్టుకుంటాయి .  మరికొన్ని వానకు తడిసి రోగాలు తెచ్చుకుంటాయి. ఇలాంటి వాటిని పట్టించుకునే వాళ్లుండరు. అవి మన సాయం కోసం ఎదురుచూస్తుంటాయి. ఇలాంటి సమయంలోనే వాటిని కాపాడేందుకు కోసం మనం చేసే చిన్న పనులే వాటికి ఎంతో మేలు చేస్తాయి.

తాత్కాలికంగా చోటు

వానాకాలం వీధి కుక్కలు, పిల్లులకు ఎదురయ్యే ప్రధాన సమస్య షెల్టర్. మిగతా సమయాల్లోఏ చెట్టు కిందో, గోడ చాటునో తలదాచుకుంటాయి. కానీ వానకు అక్కడ ఉండలేవు వర్షం పడని చోటు కోసం వెతుకుతాయి ఇలాంటి సమయాల్లో మీరు వాటిపై కొంచెం దయచూపండి మీ అపార్ట్మెంట్, ఇల్లు, బిల్డింగ్ లోపలికి రానివ్వండి. అవి చోటు వెతుక్కుంటూ వస్తే బయటకు వెళ్లగొట్టకండి. మెట్ల దగ్గరో, గోడ చాటునో, షెడ్లకిందో  పక్కన ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఉండనివ్వండి. మంచి నీళ్లు, ఆహారం అందించండి. అలాగే అ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలి. బాగా వర్షంపడే సమయంలో ఈ సాయం తప్పనిసరిగా చేయండి. వర్షాలు తగ్గేంతవరకు ఉండనివ్వండి.

టెంపరరీ షెల్టర్లు

మీ ఇళ్లల్లో చోటిలేకపోయినా పబ్లిక్ పార్కులు, ఖాళీ స్థలాల్లో వాటి కోసం చాలాకాలం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయొచ్చు. రబ్బరు టైర్లు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ కవర్లు, ప్లైవుడ్, పాత రేకులు వంటి వాటిని ఉపయోగించి ..రెండు.. మూడు కుక్కలైనా ఉండగలిగేలా టెంపరరీ. షెడ్లు ఏర్పాటు చేయండి. మీ ఇంట్లో పనికిరానీ వాటితోనే కొద్దిగా శ్రమించి వీటిని ఏర్పాటు చేయొచ్చు. చట్టప్రకారం ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో తలదాచుకుంటున్న జంతువుల్ని వెళ్లగొట్టడం హింసించడం నేరం అనే సంగతి గుర్తించండి..

వర్షాకాలంలో జంతువుల ఆరోగ్యం

ఈ సీజన్లో జంతువులకు వాటర్ బోర్స్ డిసీజెస్ వస్తాయి. నీళ్లలో ఎక్కువగా తడపడం వల్ల పుండ్లు పడతాయి. చర్మ సమస్యలొస్తాయి. ఇలాంటి కుక్కలు, పిల్లులు గనుక కనిపిస్తే యానిమల్ వెల్ఫేర్ సొసైటీలకు లేదా దగ్గర్లోని వెటర్నరీ సిబ్బందికైనా కాల్ చేయండి చాలా సంస్థలు జంతువులకు ఉచితంగా ట్రీటిమెంట్ ఇస్తాయి. అలాగే వాటిపై యాంటీ బయాటిక్​ పౌడర్లు చల్లితే గాయాలు కాస్త త్వరగా తగ్గిపోతాయి. జంతువులు ఏరకమైన అనారోగ్యంతో బాధపడుతున్నా యానిమల్ కేర్​ సెంటర్లకు తెలియజేయండి. మీరు చేయాల్సిందల్లా వాళ్లకు సమాచారం ఇవ్వడమే.

పెంపుడు జంతువులైతే.....

వీధి జంతువుల విషయంలోనే కాకుండా ఇంట్లోని పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటికి అవసరమైన. వ్యాక్సినేషన్స్ ఇప్పించాలి. అవి ఉండే చోటు శుభ్రంగా, వెచ్చదనం ఉండేలా చూడాలి.. వర్ణాకాలం కాబట్టి నీళ్లలో తడవకుండా జాగ్రత్తపడాలి. వాటికి కూడా జ్వరం, దగ్గు, మూత్ర సమస్యలు, స్క్రీన్ డిసీజెస్ రావొచ్చు. ముందుగానే వెటర్నరీ డాక్టరు కలిసి తగిన జాగ్రత్తలు, మెడిసిన్స్ తీసుకోవాలి తప్పనిసరిగా రోజూ స్నానం చేయించి శుభ్రంగా ఉండాలి.

ముంబైలో జరిగిన ఓ ఘటన

 ముంబైలో వర్షానికి తట్టుకోలేక ఒక వీధి కుక్క దగ్గర్లో ఉన్న అపార్ట్మెంట్ లోకి వెళ్లింది. అపార్ట్మెంట్ సెక్రటరీ, వాచ్​మెన్ కలిసి లోపలికొచ్చిన కుక్కను దారుణంగా కొట్టారు. దీంతో అది కోమాలోకి వెళ్లిపోయింది. ట్రీట్​ మెంట్ ఇచ్చినా కోలుకోవడం లేదు. కుక్కపై అమానుషంగా దాడి చేసిన వాళ్లపై పోలీసులు. కేసు పెట్టారు. ఈ అంశం వర్షాకాలంలో వీధి కుక్కలకు ఉన్న ఇబ్బందని తెలిసేలా చేసింది. వర్షానికి ఎక్కడ ఉండాలో తెలియక మీ ఇంటి వైపో, అపార్ట్ మెంట్ లోపలికో వచ్చే కుక్కలు, పిల్లుల్ని అలా కొట్టి హింసించకండి. వాటి పరిస్థితిని అర్థం చేసుకుని షెల్టర్ ఇవ్వాలని కోరుతున్నారు జంతు ప్రేమికులు.