రైతు సమగ్ర సర్వే : 39 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్  

రైతు సమగ్ర సర్వే : 39 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్  

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 2014లో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మాదిరిగానే ప్రత్యేకంగా రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ‘రైతు సమగ్ర సర్వే’ చేపడుతోంది . ఇప్పటివరకు రైతుల కచ్చితమైన వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. దీంతో పథకాల రూపకల్పనలో ఇబ్బందు లేర్పడుతున్నా యి. ఈ పరిస్థితిని అధిగమించేందు కు ఓ డేటాబేస్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయిం చిన ప్రభుత్వం ఈ నెల 25 నుంచి మే 15లోగా రాష్ట్రంలో ని 54లక్షలకుపైగా ఉన్న రైతుల వివరాలు సేకరించనుంది . ఇందుకు 39 అంశాలతో ఫార్మాట్‌ రూపొందించారు. ప్రతి ఏఈఓ తమ పరిధి గ్రామాల్లోని రైతుల వివరాలను ట్యాబ్స్ లోని ప్రత్యేక పోర్టల్ లో అప్ లోడ్‌ చేస్తారు.

ఆధార్‌ కార్డు ల వివరాలతో సహా రైతుల విద్యార్హత, పండించే పంటలు, నీటి వసతి, నేలల రకాలు, వ్యవసాయంలో టెక్నా లజీ వాడకం, పంట రుణాలు, పంట బీమా, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలను సేకరిస్తారు. సర్వే విశ్లేషించి నిర్ణయాలు సర్వే వివరాలను విశ్లేషించి ఏ ప్రాంతంలో ఏ నేలలున్నాయి, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేయాలి..తదితర అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు సూచనలు చేయనున్నారు. ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి ఆయా పంటల సాగుకు రైతులను సమాయత్తం చేస్తారు.