పోర్న్ సంపాదనపై లీకైన శిల్పా శెట్టి భర్త వాట్సాప్ చాట్ 

V6 Velugu Posted on Jul 20, 2021

ముంబై: పోర్న్ ఫిలిమ్స్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. అమాయక మహిళల్ని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి.. ఆ తర్వాత పోర్న్‌లోకి దించుతున్న కేసులో కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రాజ్‌ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఒక నెట్‌వర్క్ సెట్ చేసుకుని, ముంబైకి వచ్చే అమ్మాయిలను ట్రాప్‌ చేసి ముందుగా పోర్న్‌లో చేస్తే ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీళ్లు పోర్న్ సినిమాలు తీయడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా రిలీజ్ చేస్తున్నారని గుర్తించామన్నారు.

పోర్న్ మూవీల ద్వారా భారీ ఆదాయం
పోలీసుల సమాచారం ప్రకారం.. రాజ్ కుంద్రాకు యూకేలో ప్రదీప్ బక్షీ అనే బంధువు ఉన్నాడు. కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ అనే కంపెనీని ప్రదీప్ నడుపుతున్నాడు. పలు వ్యాపారాల్లో రాజ్ కుంద్రాకు ప్రదీప్ పార్ట్‌నర్‌‌గా ఉన్నాడు. కెన్రిన్ కంపెనీకి కుంద్రా అనధికార యజమాని. ఈ సంస్థలో ఆయన పెట్టుబడులు పెట్టాడు. గతంలో కుంద్రా వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేసిన ఉమేశ్ కామత్ అనే వ్యక్తి భారత్‌లో కెన్రిన్‌ సంస్థకు రిప్రెజెంటేటివ్‌గా ఉన్నాడు.

పోర్న్ మూవీస్ తీయాలని పలువురు ఏజెంట్లకు ఈ కంపెనీ కాంట్రాక్టులు ఇచ్చేదని.. ఫండింగ్ కూడా చేసేదని తెలుస్తోంది. మోడల్, నటి గెహ్నా వశిష్ట్, ఉమేశ్ కామత్‌లు కలసి పోర్న్ ఫిల్మ్స్ తీసేవారు. ఇలా తీసిన మూవీలను హాట్‌షాట్ అనే సోషల్ మీడియా యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. ఇది పెయిడ్ యాప్ అని సమాచారం. దీన్ని పక్కనబెడితే.. రాజ్ కుంద్రాకు ప్రదీప్ బక్షికి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీకైంది.  పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ ద్వారా వీరిద్దరూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు ఈ చాట్స్ ద్వారా బయటపడింది. పోర్న్ మూవీల ద్వారా వస్తున్న లాభనష్టాలు, లావాదేవీలపై ప్రదీప్ బక్షితో రాజ్ కుంద్రా చాట్ చేయడాన్ని ఫొటోల్లో చూడొచ్చు. 

 

Tagged Raj Kundra, Porn Films Case, Shilpa Shetty Husband, Whatsapp Chats, Raj Kundra Arrested

Latest Videos

Subscribe Now

More News