ప్రేమను నిరాకరించిందని ప్రియురాలి గొంతు కోసి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. 2026 అక్టోబర్ 3న విజయవాడలో జరిగింది ఈ ఘటన. ఈ ప్రమాదంలో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. యువకుడు చనిపోయాడు.
విజయవాడలోని న్యూ రాజ రాజేశ్వరీ పేటలో.. యువకుడు కత్తితో యువతి మెడ కోశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
యువతిపై అటాక్ చేసిన తర్వాత యువకుడు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకుడిని చిన్నా గా గుర్తించారు. చనిపోయినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. దాడి వెనుక ఉన్న కారణాలు తెలియాల్సి ఉంది. ప్రేమ నిరాకరించినందుకే దాడి చేసినట్లు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
