ఈ నెల 27 వరకు రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు

V6 Velugu Posted on Jul 23, 2021

వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోలీసు కస్టడీని ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు పొడిగించింది. ఇవాళ్టి(శుక్రవారం) తో రాజ్ పోలీసు కస్టడీ ముగుస్తుండటంతో... ఆయన్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కస్టడీని పొడిగించాలని ఈ సందర్భంగా కోర్టును పోలీసులు కోరారు. దీంతో.. రాజ్ కుంద్రాతో పాటు, అతని సహచరుడు ర్యాన్ థోర్పే పోలీస్ కస్టడీని ఈనెల 27 వరకు పొడిగించింది కోర్టు.

ఈ నెల 19న రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ యాప్ ద్వారా పోర్న్ కంటెంట్ ను చూపిస్తున్నారనే ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాజ్ కుంద్రా నుంచి 4 టీబీ అడల్ట్ కంటెంట్ ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. ఆశ్లీల చిత్రాల ద్వారా వచ్చిన సంపాదనను రాజ్ కుంద్రా ఆన్ లైన్ బెట్టింగులకు ఉపయోగించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tagged police custody, July 27, Raj Kundra, Extended

Latest Videos

Subscribe Now

More News