టార్టాయిస్‌‌ కిక్ ఇస్తుంది అంటున్న రాజ్ తరుణ్.. డిఫరెంట్ థీమ్తో కొత్త మూవీ ప్రారంభం

టార్టాయిస్‌‌  కిక్ ఇస్తుంది అంటున్న రాజ్ తరుణ్.. డిఫరెంట్ థీమ్తో కొత్త మూవీ ప్రారంభం

రాజ్ తరుణ్ హీరోగా సోమవారం కొత్త చిత్రం ప్రారంభమైంది. అమృత చౌదరి హీరోయిన్. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు కలిసి నిర్మిస్తున్నారు.

 ‘టార్టాయిస్‌‌’ టైటిల్‌‌తో ఈ చిత్రాన్ని  తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. సోమవారం (నవంబర్ 17) పూజా కార్యక్రమాలతో ప్రారంభించి సినిమాకు సంబంధించి   మోషన్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.   ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్స్,  అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

 మూవీ లాంచింగ్ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ కథా కథనంతో రిత్విక్ స్ర్కిప్ట్ రెడీ చేశారు.  ఈ మూవీ నా కెరీర్‌‌‌‌కి మంచి కిక్ ఇస్తుంది’ అని చెప్పాడు. ఇదొక థ్రిల్లర్ అని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని దర్శకుడు రిత్విక్ చెప్పాడు.  ఈ కథపై పూర్తి నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు అన్నారు.