
మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేను విచారిస్తోంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్. కాసేపటి క్రితం ఈడీ ముందు హాజరయ్యారు రాజ్ థాకరే. ఈ నేపథ్యంలో ముంబయిలోని మెరైన్ డ్రైవ్, MRA మార్గ్, ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ED ఆఫీస్, రాజ్ థాకరే ఇల్లు, MNS ఆఫీస్ దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రాజ్ థాకరే అనుచరుడు దేశ్ పాండేను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
IL అండ్ FS గ్రూప్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ దర్యాప్తు చేస్తోంది. IL అండ్ FS గ్రూప్ కోహినూర్ CTNL లో పెట్టుబడులు పెట్టింది. ఈ కోహినూర్ CTNL సంస్థ ముంబయిలోని దాదర్ ఏరియాలో కోహినూర్ స్క్వేర్ టవర్ ను నిర్మిస్తోంది. ఈ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక అవకతవకల కేసులోనే రాజ్ థాకరేను ప్రశ్నించనున్నారు ED అధికారులు.