రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారిక దాసరి నిర్మించిన చిత్రం ‘రాజా ది రాజా’. బుధవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. యూత్ తమకు నచ్చిన వృత్తిలో కొనసాగేందుకు పరుగులు తీస్తుంటే, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం లాంటి అంశానికి, ప్రేమకథను జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘రిత్విక్, నిహారిక ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిత్విక్ జర్నీని నేను దగ్గరగా చూశాను. చాలా డెడికేషన్‌తో వర్క్ చేశాడు.
నిహారిక చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మించారు’ అంటూ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకులు హను రాఘవపూడి, వివేక్ ఆత్రేయ, నిర్మాత మైత్రి రవి మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో రుత్విక్ మాట్లాడుతూ ‘ఈ సినిమా జర్నీ చాలా మెమొరబుల్. డైరెక్టర్ అనిల్ డెడికేషన్‌తో ఈ సినిమా చేశారు. మంజు భార్గవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. సాయి కుమార్ గారు, నరేష్ గారు అద్భుతంగా నటించారు.
నన్ను యాక్టర్‌గా గుర్తిస్తారని, ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను’ అని అన్నాడు. రిత్విక్‌కు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు అని, యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కు నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి మంజు భార్గవి, హీరోయిన్ విశాఖ ధీమన్, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ పాల్గొన్నారు.
