
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. కోటి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నేను శ్రీరాముని భక్తున్ని అయోధ్య మందిరం కోసం నేను కష్టపడ్డ సొమ్ము కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాను. గొంతు పోయిన వర్షం వచ్చిన ప్రచారం ఆపేది లేదు కేసీఆర్ని గద్దె దించుడే" అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నవంబర్ 03న జరగనున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు 06 న వెలువడనున్నాయి. రాజగోపాల్ రెడ్డితో పాటుగా బరిలో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఉన్నారు.