చిన్నారి వైద్యానికి కలెక్టర్ చేయూత

చిన్నారి వైద్యానికి కలెక్టర్ చేయూత

రాజన్న సిరిసిల్ల, వెలుగు: చిన్నారి వైద్యానికి రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్థిక చేయూత అందించారు. జిల్లాకేంద్రంలోని శివనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వేముల మధు దంపతులకు 2 నెలల కింద కవలలు జన్మించారు. 7 నెలలకే పుట్టడంతో ఆడపిల్ల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయింది. మగబిడ్డ అనారోగ్యంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్నాడు. 

తమ కొడుకు వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని మధు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విన్నవించగా.. స్పందించిన ఆయన శనివారం రూ. 50 వేల చెక్కును అందజేశారు. అలాగే సిరిసిల్ల పట్టణానికి చెందిన బోనాల వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధపడుతూ ఆర్థికసాయం కోసం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసుకున్నాడు. స్పందించిన ఆయన రూ.1,25,000 ఆర్థిక సాయం అందజేశారు.