మెడికల్ కాలేజీలకు పీజీ డాక్టర్లు..

మెడికల్ కాలేజీలకు పీజీ డాక్టర్లు..
  • టీచింగ్ సైడ్ వచ్చేటోళ్ల లిస్టు పంపాలని డీపీహెచ్, టీవీవీపీకి డీఎంఈ లెటర్
  • ప్రొబేషన్ పూర్తికానోళ్లు, విచారణ ఎదుర్కొంటున్నోళ్లకు నో చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖాన్లలో పనిచేస్తున్న పీజీ డాక్టర్లను మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి మార్చేందుకు కసరత్తు మొదలైంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో పనిచేస్తూ.. టీచింగ్ వైపు వెళ్లేందుకు ఇష్టం ఉన్న క్లినికల్, నాన్ క్లినికల్ పీజీ డాక్టర్ల లిస్టు పంపాల్సిందిగా డీఎంఈ డాక్టర్ వాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

డాక్టర్ల క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను క్షుణ్నంగా పరిశీలించాకే లిస్టు రెడీ చేయాలని డీపీహెచ్, టీవీవీపీ కమిషనర్లను డీఎంఈ ఆదేశించారు. అయితే, సర్వీస్ రెగ్యులరైజ్ కానోళ్లు, ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ కాని డాక్టర్ల పేర్లను లిస్టులో చేర్చొద్దని స్పష్టం చేశారు. అలాగే, పీజీ కంప్లీట్ అయ్యాక కనీసం ఏడాది సర్వీస్ పూర్తి చేయని డాక్టర్లతో పాటు శాఖాపరంగా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నోళ్లను కూడా అనర్హులని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం అర్హులైన డాక్టర్ల వివరాలను తయారు చేసి, ఈ నెల 23లోగా డీఎంఈ ఆఫీసుకు పంపాలని ఆమె స్పష్టం చేశారు. ఈ ఈ-మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు [email protected] సాఫ్ట్ కాపీ కూడా పంపాలని సూచించారు.