భక్తులు మెచ్చేలా రాజన్న ఆలయ నిర్మాణం : ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్

భక్తులు మెచ్చేలా రాజన్న ఆలయ నిర్మాణం : ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: ఆగమశాస్ర్త ప్రకారం, శృంగేరి పీఠాధిపతుల సూచనలతో భక్తుల మెచ్చేలా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఈవో రమాదేవితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురైన రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇందుకు రూ.150కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తాను సీఎంను ఎప్పుడు కలిసినా రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారన్నారు. మహా మండపంలో అనిమిటి మండపం, బ్రాహ్మణ సత్రం, కోటి లింగాలు, ధర్మ గుండం.. వంటి అన్ని నిర్మాణాలు ఏకకాలంలో జరుగుతున్నాయని, అన్ని పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.