మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుటుంబంలో విషాదం

మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుటుంబంలో విషాదం

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరి విమ్లా దేవి కచావా కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 93 సంవత్సరాలు.  విమల్ దేవి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కన్నుమూశారు.  

అక్క విమ్లా దేవి కచావా మరణం తనలో ఎప్పటికీ పూరించలేని శూన్యతను మిగిల్చిందని, దేవుడు ఆమెకు ఆయన పాదాల వద్ద స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నాను అని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.  విమ్లా దేవి తనకు తల్లిలాంటిదని  అశోక్ గెహ్లాట్ తెలిపారు.  విమలా దేవికి రణవీర్ సింగ్ కచ్ఛవాహ మరియు జస్వంత్ సింగ్ కచ్ఛవాహ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.