RCBతో ఫైనల్ ఆడేది ఎవరు?.. క్వాలిఫయర్ 2లో గెలిచే చాన్స్ ఎవరికి ఉందంటే!

RCBతో ఫైనల్ ఆడేది ఎవరు?.. క్వాలిఫయర్ 2లో గెలిచే చాన్స్ ఎవరికి ఉందంటే!

RR vs GT Qualifier 2:  సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయంతో మంచి ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ 2026లో తమ తదుపరి ‘డూ ఆర్ డై’ పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఇప్పటికే క్వాలిఫయర్-1లో గెలిచి ఆర్‌సీబీ నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా, రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చేందుకు మే 29న న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ పీసీఏ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT)తో రాజస్థాన్ (RR) తలపడనుంది. 

ఈ క్వాలిఫయర్ 2 గెలిచేది ఎవరంటే?: 
ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ముల్లాన్‌పూర్‌లో జరగబోయే ఈ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌ను కూడా రాజస్థాన్ ఇదే వేదికపై ఆడటంతో, ప్రత్యర్థి కంటే వారికి ఇక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుంది. మరోవైపు, ప్లేఆఫ్స్ మొదటి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన గుజరాత్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. లీగ్‌లో ఫైనల్‌కు వెళ్లడానికి మరో ఛాన్స్ రావడంతో శుభ్‌మన్ గిల్ సేన ఈసారి ఎలాగైనా రాయల్స్‌ను అడ్డుకోవాలని ప్లాన్ వేసింది.  

రెండు జట్ల ‘ఫామ్’: 
* గుజరాత్ టైటాన్స్ (GT): ఆర్‌సీబీ ఇచ్చిన 255 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ దారుణంగా తడబడింది. రాహుల్ తెవాటియా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ 68 రన్స్ చేసినప్పటికీ, మిగిలిన బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో గుజరాత్ కేవలం 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ALSO READ : ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్ vs రాజస్థాన్ ఫైట్..

* రాజస్థాన్ రాయల్స్ (RR): సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు శివతాండవం చేశారు. ముఖ్యంగా 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 రన్స్ చేసి చరిత్ర సృష్టించాడు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ అద్భుతంగా రాణించి హైదరాబాద్‌ను 196 పరుగులకే కట్టడి చేయడంతో 47 రన్స్ తేడాతో గెలిచారు.