సంజూ అదరహో..లక్నోపై రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ గెలుపు

సంజూ అదరహో..లక్నోపై రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ గెలుపు
  • రాణించిన పరాగ్‌‌‌‌‌‌‌‌, బౌల్ట్‌‌‌‌‌‌‌‌

జైపూర్‌‌‌‌‌‌‌‌: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో ఆకట్టుకున్న రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–17లో బోణీ చేసింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ (82*), రియాన్‌‌‌‌‌‌‌‌ పరాగ్‌‌‌‌‌‌‌‌ (43) దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన తొలి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 20 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో లక్నో సూపర్‌‌‌‌‌‌‌‌జెయింట్స్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 193/4 స్కోరు చేసింది. రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే జోస్‌‌‌‌‌‌‌‌ బట్లర్‌‌‌‌‌‌‌‌ (11) ఔటైనా, శాంసన్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ చివరి వరకు ఉండి భారీ స్కోరు అందించాడు. 

ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (24) వేగంగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో 49 రన్స్‌‌‌‌‌‌‌‌కే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ను శాంసన్‌‌‌‌‌‌‌‌, రియాన్‌‌‌‌‌‌‌‌ పరాగ్‌‌‌‌‌‌‌‌ ఆదుకున్నారు. దాదాపు 10 ఓవర్ల పాటు లక్నో బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఉతికేశారు. లాంగాన్‌‌‌‌‌‌‌‌, లాంగాఫ్‌‌‌‌‌‌‌‌, మిడాన్‌‌‌‌‌‌‌‌లో ఆరు భారీ సిక్సర్లు కొట్టిన శాంసన్‌‌‌‌‌‌‌‌ 33 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేశాడు. పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో 54/2 స్కోరు చేసిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ 10.4 ఓవర్లలో వంద రన్స్‌‌‌‌‌‌‌‌కు చేరింది. థర్డ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌కు 93 (59 బాల్స్‌‌‌‌‌‌‌‌లో) రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో పరాగ్‌‌‌‌‌‌‌‌ ఔటయ్యాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో హెట్‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌ (5) వెనుదిరిగినా, చివర్లో ధ్రువ్‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌ (20*) వేగంగా ఆడాడు. శాంసన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 22 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 43 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించాడు.  

రాహుల్​, పూరన్​ పోరాటం వృథా..

తర్వాత ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో లక్నో 20 ఓవర్లలో 173/6 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (58), నికోలస్‌‌‌‌‌‌‌‌ పూరన్‌‌‌‌‌‌‌‌ (64*) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కే డికాక్‌‌‌‌‌‌‌‌ (4) ఔటయ్యాడు. వెంట వెంటనే దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌ (0), ఆయూష్‌‌‌‌‌‌‌‌ బదోనీ (1), దీపక్‌‌‌‌‌‌‌‌ హుడా (26) వికెట్లు పడటంతో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ 60/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్‌‌‌‌‌‌‌‌, పూరన్‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 85 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి గెలుపు దిశగా తీసుకెళ్లారు. 

కానీ 17వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో రాహుల్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌తో ఫలితం తారుమారైంది. పూరన్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నించినా స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ (3), క్రునాల్‌‌‌‌‌‌‌‌ పాండ్యా (3*) ఫెయిల్‌‌‌‌‌‌‌‌కావడంతో ఓటమి తప్పలేదు. శాంసన్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. బౌల్ట్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశాడు.