ఏం టాలెంట్ రా బాబూ.. నెత్తిపై మూడు గ్యాస్ సిలిండ‌ర్లతో డాన్స్..

ఏం టాలెంట్ రా బాబూ.. నెత్తిపై మూడు గ్యాస్ సిలిండ‌ర్లతో డాన్స్..

మామూలుగా ఒక్క సిలిండర్ ను ఎత్తితేనే చాలా గొప్పగా చూస్తాం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సిలిండర్లను నెత్తిపై పెట్టుకుని తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ప్రతిభను అంతా మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి రాజస్థాన్ కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ గా తెలుస్తోంది.

వైరల్ అవుతోన్న ఈ వీడియోలో వ్యక్తి తన తలపై సిలిండర్‌లను బ్యాలెన్స్ చేస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. చాలా మంది ఖాళీ సిలిండర్ ను కూడా ఎత్తకపోవచ్చు. కానీ ఈ యువకుడు మాత్రం రెండు గ్లాసులపై మూడు సిలింర్లను తన తలపై పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. దాంతో పాటు తన చేతులను అటూ, ఇటూ ఆడిస్తూ కూడా కనిపించాడు.

ఇక ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ను గమనించినట్టయితే.. ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నాయి. వాటిల్లో  అతను తన తలపై వస్తువులను బ్యాలెన్స్ చేస్తూ తన ప్రతిభను ప్రదర్శించాడు. అతను ఇండియాస్ గాట్ టాలెంట్‌లోనూ పార్టిసిపేట్ చేశాడని , శిల్పా శెట్టి, బాద్షా, కిరణ్ ఖేర్, ఇతర న్యాయమూర్తుల సమక్షంలో రియాలిటీ షో వేదికపై ప్రదర్శన ఇచ్చాడని కూడా కొన్ని రీల్స్ ను బట్టి చూస్తే తెలుస్తోంది.

దాదాపు 20వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే అతను సిలిండర్లను ఎలా బ్యాలెన్స్ చేశాడు అని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో యువకుడిని చూసి గర్వంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.