IPL 2025: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న RCB ప్లేయర్స్.. శ్రేయంకా పాటిల్ కూడా వచ్చిందే!

IPL 2025: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న RCB ప్లేయర్స్.. శ్రేయంకా పాటిల్ కూడా వచ్చిందే!

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతుంది. ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పత్తిఆకాలో టాప్ లో ఉంది. ఆర్సీబీ ఖాతాలో ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో మరో మ్యాచ్ గెలిచినా అలవోకగా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెడుతుంది. ఆదివారం (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించిన తర్వాత బెంగళూరుకు ఆరు రోజుల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆర్సీబీ ప్లేయర్స్ రిలాక్స్ అవుతున్నారు.

ఆరు రోజుల గ్యాప్ రావడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్, వికెట్ కీపర్ జితేష్ శర్మ మంగళవారం (ఏప్రిల్ 29) ప్రసిద్ధ తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. వారితో పాటు RCB మహిళా జట్టు స్పిన్నర్ శ్రేయంకా పాటిల్ కూడా ఉండడం విశేషం. శ్రేయాంక పాటిల్ విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్. ఉమెన్స్ ఐపీఎల్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతోంది. దీంతో ఆమె ఈ సారి తమ జట్టుకు ఎలాగైనా టైటిల్ రావాలని కోరుకుంటుంది. పటిదార్, జితేష్ శర్మలతో పాటు శ్రేయాంక పవిత్ర స్థలంలో ప్రార్థనలు చేశారు.

ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తదుపరి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం (మే 3) ఆడనుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 9 న లక్నో సూపర్ జయింట్స్ తో.. మే 13 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో.. మే 17 న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ మ్యాచ్ లు ఆడనుంది.