నూతన ఎన్నికల ప్రధాన కమీషనర్ గా రాజీవ్ కుమార్

నూతన ఎన్నికల ప్రధాన కమీషనర్ గా రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ నెల 14న ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్ర పదవీ విరమణ చేయనుండగా... ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ కుమార్... 2020 సెప్టెంబర్ లో కేంద్ర ఎన్నికల కమీషనర్ గా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్ గా పని చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు క్యూ

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది