తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. గోవాలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.  దేశంలోనే 100 శాతం కోవిడ్ వాక్సిన్ ఇచ్చిన మొదటి రాష్ట్రంగా గోవా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఫలాలు గోవాలో అందుతున్నాయన్నారు. తెలంగాణ లోకూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని..రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. గోవా లో వితంతు పెన్షన్ ఇస్తున్నామని.. కళ్యాణ లక్ష్మి పథకం గోవాలో కూడా ఉందని..వివాహ సమయంలో పేదింటి ఆడ పిల్లకు లక్ష రూపాయలు తాము ఇస్తున్నామని చెప్పారు. రైతులకు, పాడి రైతులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

నార్త్ కొరియాలో రెండేళ్ల తర్వాత తొలి కరోనా కేసు

దేశంలో కొత్తగా 2, 827 కరోనా కేసులు