నార్త్ కొరియాలో రెండేళ్ల తర్వాత తొలి కరోనా కేసు

నార్త్ కొరియాలో రెండేళ్ల తర్వాత తొలి కరోనా కేసు

నార్త్ కొరియాలో రెండేళ్ల తర్వాత తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలో వైరస్ బయటకొచ్చిన వెంటనే సరిహద్దులు మూసేసి కట్టడి చర్యలు చేపట్టారు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్. ఇన్నాళ్లూ ఒక్క కరోనా కేసు రాలేదని గర్వంగా చెప్పుకున్నారు. ప్రస్తుతం ఒక కరోనా కేసు నమోదవడంతో.. కొవిడ్ కట్టడి చర్యలు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియా వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని స్పష్టం చేశారు. ప్యాంగ్యాంగ్ లో పలువురికి కరోనా టెస్టులుచేయగా.. వారిలో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయినట్లు తెలిపింది కొరియన్ సెంట్రల్ న్యూజ్ ఏజెన్సీ. కరోనా కేసు రావడంతో అత్యవసరంగా కొరియన్ వర్కర్స్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశమైన అధ్యక్షుడు కిమ్ జోంగ్.. కట్టడి చర్యలు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి అదుపు చేసి... ముందస్తు చర్యలు తీసుకురావని అన్నారు.

ఇప్పటి వరకు తమ భూభాగంలోకి కరోనా రాలేదని గర్వంగా చెప్పుకుంది నార్త్ కొరియా. చైనాలో వైరస్ కేసులు వెలుగు చూసిన వెంటనే అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసి.. వాణిజ్య, పర్యటకులను సైతం దేశంలోకి రానీయకుండా చేసింది. దీంతో నార్త్ కొరియా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. దానికి తోడు దశాబ్దాల సంబద్ధ పాలన, అమెరికా ఆంక్షలు సంక్షోభాన్ని మరింత పెంచాయి.