అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు క్యూ

అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు క్యూ

హైదరాబాద్లో అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ఫస్ట్ డిజిటల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైటెక్ సిటీలో కాల్ అవే గోల్ఫ్  కంపెనీని ప్రారంభించారు మంత్రి కేటీఆర్.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ సంస్థలను నిర్వహిస్తున్నాయని, వాటి సరసన కాల్ అవే చేరిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ సెంటర్, గూగుల్, ఉబెర్, యాపిల్, నోవార్టిస్ వంటి ప్రముఖ సంస్థలతో ఇండియాలో హైదరాబాద్ నెంబర్ వన్  సిటీ గా మారిందన్నారు. 
మౌళిక వసతులు, సదుపాయాలు కల్పించడంలో ఇతర నగరాల కంటే మన హైదరాబాద్ నగరం ముందుందని..అందుకే అంతర్జాతీయ కంపెనీలు అమెరికా తర్వాత తమ బ్రాంచ్ లను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నాయన్నారు. రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ 300మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కాల్ అవే కంపెనీకి ప్రభుత్వ సహాకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు మంత్రి కేటీఆర్.

 

 

 

ఇవి కూడా చదవండి

మాజీ పంచాయితీ అధికారి ఇంట్లో భారీగా ఆస్తుల గుర్తింపు

వీడియో: కదులుతున్న రైల్లో నుంచి పడబోతుంటే..

ఆరేండ్లకే అదిరిపోయే స్పీచ్ లతో చిన్నారి రికార్డ్​