వీడియో: కదులుతున్న రైల్లో నుంచి పడబోతుంటే..

 వీడియో: కదులుతున్న రైల్లో నుంచి పడబోతుంటే..

భువనేశ్వర్: ఆమెకు ఇంకా భూమ్మీద నూకలున్నాయ్. కదులుతున్న రైలులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. రెప్పపాటులో రైల్వే కానిస్టేబుల్ స్పందించి కాపాడటంతో బతుకు జీవుడా అంటూ ప్రాణాలను దక్కించుకుంది. కదులుతున్న రైలులో నుంచి ప్లాట్ ఫామ్ మీదకు దిగేందుకు ప్రయత్నించింది. కానీ, కాలు పట్టుతప్పి ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడబోయింది. అదే బోగిలో ఆమె వెంట ఉన్న మరో మహిళ పెద్దగా కేకలు వేసింది. ఆ సమయంలో ప్లాట్ ఫామ్ పై ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి సదరు మహిళను రైలు కింద పడకుండా తన ప్రాణాలను తెగించి ఆమెను రక్షించాడు. మహిళను రక్షించే క్రమంలో కానిస్టేబుల్ కూడా ప్లాట్ ఫామ్ పై పడిపోయాడు.

అదే బోగిలో ఉన్న మరో మహిళ కూడా రైలు నుంచి ప్లాట్ ఫామ్ పైకి దూకింది. అక్కడే ఉన్న ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో రైలు గార్డ్ వెంటనే స్పందించి రైలును ఆపేశాడు. రైలు వెళ్తున్న సమయంలో ఆమెను రక్షించేందుకు కానిస్టేబుల్ చేసిన ప్రయత్నాన్ని అందరూ ప్రశంసించారు. అక్కడున్నవారు కూడా కానిస్టేబుల్ ఎస్.ముండా సాహసాన్ని మెచ్చుకున్నారు. ఈ ఘటన భువనేశ్వర్ రైల్వేస్టేషన్ లో జరిగింది. దీనికి సంబంధించి వీడియో స్టేషన్ లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. 

ఇవి కూడా చదవండి

మాజీ పంచాయితీ అధికారి ఇంట్లో భారీగా ఆస్తుల గుర్తింపు

ఆరేండ్లకే అదిరిపోయే స్పీచ్ లతో చిన్నారి రికార్డ్​