ఆ కారణం వల్లే చంద్రబాబును కలవలేకపోయా: రజనీకాంత్‌

ఆ కారణం వల్లే చంద్రబాబును కలవలేకపోయా: రజనీకాంత్‌


చంద్రబాబుతో తన ములాఖత్‌పై వచ్చిన వార్తలపై కోలీవుడ్‌ ప్రముఖ నటుడు రజనీకాంత్‌ స్పందించారు. తానెందుకు చంద్రబాబును కలవలేకపోయారో తెలిపారు.  

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ కలుస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిపై రజనీకాంత్‌ తాజాగా స్పందించారు. చంద్రబాబును తాను కలవాలనుకున్నానని, ఫ్యామిలీ ఫంక్షన్‌ వల్ల తాను వెళ్లలేకపోయానని చెప్పారు. తన కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్‌ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలుదేరారు. 

ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయం చేరుకోగానే.. చంద్రబాబుతో ములాఖత్‌ గురించి మీడియా ప్రశ్నించగా రజనీకాంత్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు.

చంద్రబాబు, రజనీకాంత్‌ల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కు రజనీకాంత్‌ కొన్ని రోజుల క్రితం ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని రజినీకాంత్ వివరించారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష.. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవని అన్నారు.