జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తామని ఎద్దేవా చేశారు. పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో పొత్తు విషయం మాట్లాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ ను మెడపట్టి అమిత్ షా గెంటేస్తారని పేర్కొన్నారు.
పవన్ కు మంత్రి రోజా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయినా, ఎవడికైనా పళ్లు రాలగొడతామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తన స్థాయికి మించి మాట్లాడితే ఎవ్వరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పవన్ తన రాజకీయ చరిత్రలో ప్యాకేజీ విషయంలోనే హిట్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులు లేని పవన్ యుద్దం చేస్తానంటే అందరూ నవ్వుకుంటున్నారని తెలిపారు.