ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి

ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‏లోని ఏలూరు జిల్లా ఉంగటూరు మండలంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. చేబ్రోలు స్టేషన్ సమీపంలో చర్లపల్లి-షాలిమార్ రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ యువకుడు ఉన్నారు. శనివారం (జులై 4) రాత్రి ఈ ఘటన జరిగింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‎మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

నలుగురి మృతికి ఆత్మహత్య లేదా ప్రమాదమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల్లోని ఓ మహిళ దగ్గర షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే, ఘటన స్థలంలో రెండు సెల్ ఫోన్లు, తాడేపల్లి ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు లభ్యమైంది.