జయశంకర్ భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్, వెలుగు: భూసమస్యలు పరిష్కరించడంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం బల్క్ భూముల సర్వే, సాదా బైనామా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై భూపాలపల్లి నియోజకవర్గ రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన పూర్తి నివేదికలను సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సర్టిఫికెట్లను అందజేశారు. మొదటి విడతగా 24 మంది నిరుద్యోగ యువతకు డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్లు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
