ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం : హనుమంతరావు

ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం :  హనుమంతరావు

బషీర్ బాగ్, వెలుగు :  ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 20న రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నట్టు మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నానని, కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని చెప్పారు. బషీర్ బాగ్ ఫతే మైదాన్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు. 16 ఏండ్లుగా రాజీవ్ గాంధీ పేరిట ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేస్తే , గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావొచ్చునని చెప్పారు.  ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లాలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వీహెచ్ ఖండించారు. ప్రధాని స్థాయి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కొత్త వాళ్లను పార్టీలోకి తీసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.